అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించడమే కాకుండా, కరోనా వైరస్‌ను వైకాపా రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడిని విచారించాలన్న కోర్టు సూచనలను అధికారులు పక్కనపెట్టడం దారుణమన్నారు. కక్షపూరిత రాజకీయాలను విడనాడి, అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది' - నెల్లూరులో తెదేపా నేతలు నిరసన
అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నెల్లూరు పట్టణంలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తక్షణం అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు ఆందోళన