నెల్లూరు నగరం మాఫియాకు అడ్డాగా మారిందంటూ ముందు నుంచీ తెదేపా మొత్తుకుంటుందని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆ విషయాలనే వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బహిర్గతం చేశారన్నారు. నగరంలో ఇసుక, భూఅక్రమాలు, లిక్కర్, బెట్టింగ్, సెటిల్మెంట్ మాఫియాలు విజృంభిస్తున్నట్లు తాము ముందే అధికారులకు ఫిర్యాదు చేశామని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి పార్టీకి విరుద్ధంగా వ్యవహరించారని అనడంలో అర్థం ఏమిటంటూ ప్రశ్నించారు.
'మేమెప్పుడో చెప్పాం... ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు చెప్పారు' - Tdp Press Meet in nellore
నెల్లూరులో మాఫియాలున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలను తామెప్పుడో చెప్పామని తెలుగుదేశం నేతలన్నారు.
!['మేమెప్పుడో చెప్పాం... ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు చెప్పారు' 'మేము ముందు చెప్పిందే ఆనం వెంకరమణారెడ్డి ఇప్పుడు చెప్పారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5309292-959-5309292-1575812198764.jpg)
'మేము ముందు చెప్పిందే ఆనం వెంకరమణారెడ్డి ఇప్పుడు చెప్పారు'
'మేమెప్పుడో చెప్పాం... ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు చెప్పారు'
ఇదీ చదవండి :
TAGGED:
Tdp Press Meet in nellore