ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బడ్జెట్​లో నిధులు ఘనం.. చేసిన పనులు శూన్యం' - వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై బీదా రవిచంద్ర విమర్శల వార్తలు

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం బడ్జెట్​లో నిధులు ఘనంగా కేటాయించిందని.. అయితే ఆ నిధులతో చేసిన కార్యక్రమాలు ఏమీ లేవని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. మోసపూరిత పాలన చేయడం తప్ప ఏడాది కాలంలో సాధించిందేమీ లేదన్నారు.

tdp mlc beeda ravichandra crtitcises ycp one year regime
బీదా రవిచంద్ర, తెదేపా ఎమ్మెల్సీ

By

Published : May 31, 2020, 6:10 PM IST

వైకాపా ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని నెల్లూరు తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. బడ్జెట్​లో అన్నింటికీ ఘనంగా నిధులు కేటాయించి.. ఖర్చు మాత్రం నామమాత్రంగా చేశారని మండిపడ్డారు. ఏడాది పాలనలో వైకాపా సాధించిందేమీ లేదని విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో లక్షా 6 వేల కోట్లు అప్పు చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 87 వేల కోట్లు అప్పు చేసిందన్నారు.

వ్యవసాయానికి 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 57.15 లక్షల మందికి పైగా కిసాన్ యోజన అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 49.43 లక్షల మందికే ఈ పథకాన్ని అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేయకపోగా... గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిందని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి...విద్యుత్ తీగలపై వెళ్లిన ఎడ్లబండి... రైతు, ఎద్దు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details