TDP Minorities Rally: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నాయకుడు అల్లాభక్షుపై ఎమ్మెల్యే దాడి చేయించి, బాధితులపైనే తిరిగి కేసులు పెట్టించారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. దాడుల సంస్కృతి విడనాడకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు అధికమయ్యాయి: టీడీపీ మైనార్టీ నాయకులు - కలెక్టర్ వద్దకు టీడీపీ మైనారిటీల నిరసన ర్యాలీ
TDP Minorities Rally: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నిరసన ర్యాలీ నిర్వహించింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
protest
'వైసీపీ ప్రభుత్వం మైనార్టీల గొంతు కోసింది. జగన్‌కి ఓట్లేసి, సీఎం చేసి మా నెత్తినెక్కిచ్చుకున్నాం. జగన్ మంచి చరిత్ర రాస్తాడనుకుని విజయం ఇచ్చాం కానీ ఇలా రక్తచరిత్ర రాస్తాడనుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అన్యాయాలు మైనార్టీల ఇళ్ల గడపల దాకా వచ్చాయి. రాష్ట్రంలో మైనార్టీలపై ఉన్నఅక్రమ కేసులు ఎత్తివేయాలి.. దాడులు పునావృతం కాకుండా చూడాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా'- హబిబా, ముస్లిం మైనారిటీ మహిళా నాయకురాలు
ఇవీ చదవండి: