నెల్లూరు జిల్లాలో వైకాపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తేదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు తాము నిత్యావసరాలు పంపిణీ చేస్తే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలతో వైకాపా నాయకులు పంపిణీ చేపడుతుంటే తప్పులేదని, చంద్రబాబు బొమ్మతో తాము నిత్యావసరాల పంపిణీ చేస్తే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని పేర్కొన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తమ అధినేత బొమ్మతోనే పేదలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తనపై తప్పుడు కేసులు పెట్టారని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం - corona cases in nellore dst
వైకాపా ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలు పంచితే తమపై కేసులపెట్టటం ఏంటని ప్రశ్నించారు.
tdp memeber kottam reddy srinivasareddy fired on ycp govt