వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని మాజీ మంత్రులు విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో పార్టీ నగర నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాక, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరం పనులను పక్కన పెట్టడం, అన్నా క్యాంటీన్లను మూసివేయడం దారుణమన్నారు. ఎంతో కష్టపడి సింగపూర్ నుంచి విమానాలు రాష్ట్రానికి తీసుకువస్తే ప్రస్తుతం ప్రభుత్వ విధానాలతో విమాన సర్వీసులను రద్దు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు 2024లో తగిన మూల్యం చెల్లించుకుంటారని విమర్శించారు.
ముఖ్యమంత్రి నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు' - nellore
నెల్లూరులో తెదేపా జిల్లా కార్యాలయంలో నగర నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందిని విమర్శించారు.
నారాయణ