పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికలపై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు గెలిస్తే మళ్లీ మళ్లీ రీకౌంటింగ్ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారులు కూడా వైకాపాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, బీదా రవిచంద్రా, కొటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, దివి శివరాం పాల్గొన్నారు.
'పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది' - Criticisms of TDP leaders on ysrcp news
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయంపై మాట్లాడారు.

తెదేపా నాయకుల మీడియా సమావేశం
ఇదీ చదవండి: ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజు