ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపాడాల్సిన పోలీసులే.. వైసీపీ పాలనలో ప్రజలను వేధిస్తున్నారు: లోకేశ్​ - కావలిలో వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలు

TDP Lokesh is Angry With the Behavior of Police: వైసీపీ ప్రభుత్వ హయాంలో.. రాజకీయ నాయకులే కాకుండా.. నేతల కనుసన్నలలో పోలీసులు కూడా.. అమాయక ప్రజలను వేధించటం అలవాటుగా మారిపోయిందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దుయ్యబట్టారు.. పోలీసుల వేధింపులు తాళలేకే తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు హర్ష ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆక్షేపించారు..

TDP Lokesh
నారా లోకేష్

By

Published : Dec 28, 2022, 8:09 PM IST

TDP Lokesh is Angry With the Behavior of Police: కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల‌ మేరకు.. పోలీసుల పెడుతున్న వేధింపులు తాళలేక తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు హర్ష.. ఎమ్మెల్యే ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర విచార‌క‌రమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. ప్రజలను ఉగ్రశక్తుల నుంచి కాపాడాల్సిన పోలీసులే.. నాయకుల కనుసన్నలలో ప్రజలను వేధించి కాటేస్తున్నారని లోకేశ్​ మండిపడ్డారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల చర్యలు.. అమాయకులను హరించేందుకు పని చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.. బాధితుడు హర్ష త్వరగా కోలుకునేలా దేవుడ్ని ప్రార్థిస్తున్నానని, అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని లోకేశ్​ భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details