ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెవిలో పూలు పెట్టుకుని తెదేపా నేతల నిరసన - నెల్లూరులో తెదేపా నేతల ఆందోళన

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరులో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన తెలియజేసింది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ నేతలు... చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.

tdp ledaers protest at nellore
నెల్లూరులో చెవిలో పూలు పెట్టుకుని తెదేపా నేతల నిరసన

By

Published : May 30, 2020, 12:24 PM IST

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరులో తెదేపా నాయకులు వినూత్న నిరసన చేశారు. ఏడాదిగా సీఎం జగన్ ప్రజలకు తీయని మాటలు చెబుతూ...చెవిలో పూలు పెడుతున్నారని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు అటకెక్కించి... ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసర ధరలు పెంచారని మండిపడ్డారు.

గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చినా ఇంకా పాలన కొనసాగింంచడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్క తీర్పు వస్తేనే ముఖ్యమంత్రులు పదవుల నుంచి వైదొలగిన సంఘటనలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details