విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. కరెంట్ బిల్లుల పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీలుస్తోందంటూ నిరసన తెలియజేశారు. తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. పేదలకు వేల రూపాయల బిల్లులు వేస్తూ... విద్యుత్ ఛార్జీలు పెంచలేదనడం దారుణమని విమర్శించారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన - నెల్లూరులో తెదేపా నేతల నిరసన వార్తలు
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెదేపా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వివిధ వేషధారణలతో నిరసన వ్యక్తం చేశారు.

తెదేపా నేతల నిరసన