PROTEST: ఎస్సైని సస్పెండ్ చేయాలంటూ తెదేపా కార్యకర్తల ఆందోళన - తెదేపా కార్యకర్తల ఆందోళన
17:28 September 20
TDP CADRE PROTEST IN NELLORE DISTRICT
నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై వీరంగంపై.. తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను వివరించేందుకు పోలీసుస్టేషన్ కి వెళ్లిన తెదేపా మండల కన్వీనర్ జనార్దన్ నాయిడుపై లాఠీతో కొట్టారని ఆరోపించారు. ఎస్సై వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలంటూ రహదారిపై తెదేపా కార్యకర్తల ఆందోళన(TDP CADRE PROTEST) చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు మర్రిపాడుకు భారీగా చేరుకుంటున్నారు. కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సుమారు 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: