శిలాఫలకం ధ్వంసంపై తెదేపా నేతల నిరసన - nellore latest news
నెల్లూరులో బీసీ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయంలో వేసిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసింది. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు యథావిధిగా శిలాఫలకాన్ని నిర్మించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నెల్లూరు నగరంలోని కొండయపాలెం గేట్ వద్ద ధ్వంసమైన బీసీ భవన్ శిలాఫలకం ప్రాంతాన్ని తెదేపా నేతలు సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. గతేడాది జనవరిలో అప్పటి మంత్రులు అచ్చన్నాయుడు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లు దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బీసీ భవన్ నిర్మాణానినకి శంకుస్థాపన చేశారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఎన్నికలు రావటంతో పనులు నిలిచిపోయాయని, కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదైనా పనులు ప్రారంభించకపోగా శిలాఫలకం ధ్వంసం చేయడం దారుణమన్నారు. శిలాఫలకంపై తెదేపా నేతల పేర్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే కొంతమంది కుట్రపూరితంగా ఇలా చేశారని ఆయన ఆరోపించారు.