ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ...రాజధాని మూడు ముక్కలాట మానుకోండి' - అమరావతి వార్తలు

'మూడు రాజధానులు వద్దు - అమరావతి ముద్దు' అంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తేదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాశీపేట మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. వెంకటగిరి న్యాయవాదుల సంఘం ప్రతినిధి కోటేశ్వరరావు, పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ ఇప్పటికైనా రాజధానిపై మూడు ముక్కలాట మానుకోవాలని హితవు పలికారు.

tdp leaders protest at nellore district
మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ తెదేపా నాయకులు నినాదాలు చేస్తూ..నిరసన తెలియజేస్తున్నారు.

By

Published : Jan 22, 2020, 4:24 PM IST

..

సీఎం గారూ....రాజధాని మూడుముక్కలాట మానుకోవాలి

ABOUT THE AUTHOR

...view details