నవాబుపేట పోలీస్‌స్టేషన్ ఎదుట తెదేపా నేతల ఆందోళన - నెల్లూరు తాజా వార్తలు
నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. తమ కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కుసుమ హరిజనవాడలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసుల వైఖరిని ఖండిస్తూ తెదేపా నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిరసనకు దిగారు. ఆటో స్టాండ్‌కు సంబంధించిన విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు తమ కార్యకర్త జాషువాను పిలిచి.. స్థానిక వైకాపా నేత రాజశేఖర్ తన అనుచరులతో దాడి చేయించాడని వారు ఆరోపించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దాడికి కారణమైన రాజశేఖర్‌పై కేసు నమోదు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం ఆ వైకాపా నాయకుడే పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ దాడి చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా దానికి కారణమైన నిందితులను అరెస్టు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.