ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి - Naidupeta latest news

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నాయుడుపేట గడియారం సెంటర్ వద్ద... తెదేపా నాయకులు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహంచారు. ఆయన ఫొటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

TDP
నెల్లూరులో ఎన్టీఆర్ కు అంజలి

By

Published : Jan 18, 2021, 3:41 PM IST

ఎన్టీఆర్ 25వ వర్ధంతి పురస్కరించుకుని... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నాయుడుపేటలో గడియారం సెంటర్ వద్ద ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

నందమూరి తారక రామారావు గొప్ప వ్యక్తి అని ఏఎంసీ మాజీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జిల్లాలో నీటి కొరత లేకుండా ఉండడానికి కారణం ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. ఆ మహానుభావుడి కృషి వల్లే... తెలుగు గంగ కాల్వ ద్వారా ప్రతి గ్రామానికి నీరు చేరుతోందన్నారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం... ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన తిరుపతిలో స్విమ్స్ ఏర్పాటు చేయడం వల్ల... రాయలసీమతో పాటు జిల్లా వాసులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి:నందమూరి తారక రామారావు.. కాషాయం కట్టిన లౌకికవాది

ABOUT THE AUTHOR

...view details