ఎస్సీలపై దాడులు జరగడాన్ని నెల్లూరు తెదేపా నేతలు అబ్దుల్ అజీజ్, కోటం రెడ్డి, శ్రీనివాసులురెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీలను మళ్లీ వందేళ్లు వెనక్కి నెడుతున్నారని విమర్శించారు. ఎస్సీలకు ఊరి బయట ఇళ్ల స్థలాలు ఇచ్చి ముఖ్యమంత్రి చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఎస్సీలందరూ ఒక్కటై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులపై పుస్తకాన్ని విడుదల చేశారు.
'రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు తారాస్థాయికి చేరాయి' - ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు న్యూస్
రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు తారాస్థాయికి చేరాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరుగుతుండటం దారుణమన్నారు.
tdp leaders on jagan govt