రాష్ట్రంలో 108 వాహనాల కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అసలు ఒప్పంద గడువు పూర్తి కాకముందే మరో సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని తేదేపా నేతలు నెల్లూరులో డిమాండ్ చేశారు.
108 వాహనాల కాంట్రాక్టులో దాదాపు రూ.307 కోట్ల అవినీతికి పాల్పడి, ఏదో ఘనకార్యం చేసినట్లు జెండా ఊపి కుయి కుయ్ అంటూ గోల చేశారని నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌తో కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పే ప్రజాప్రతినిధులకు, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.