నరక చతుర్దశి సందర్భంగా నెల్లూరులో... తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో తేదేపా నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తిరుమల నాయుడు పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అంధకారంగా తయారైందని వారు విమర్శించారు. ప్రజలను ఇన్ని విధాలుగా వేధించవచ్చా అంటూ, నరకాసురుడు సైతం ఈర్ష్య పడేలా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. దీపావళి నుంచైనా రాష్ట్రంలో కొత్త వెలుగులు విరజిమ్మాలని కోరుతున్నామన్నారు.
నరకాసురుడు ఈర్ష్య పడేలా జగన్ పాలన సాగుతోంది: తెదేపా - వైకాపాపై తెదేపా నేతల మండిపాటు వార్తలు
ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అంధకారంగా తయారైందని తెదేపా నేతలు విమర్శించారు. నరక చతుర్దశి సందర్భంగా నెల్లూరులో... తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
నరకాసురుడు ఈర్ష్య పడేలా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోంది: తెదేపా