ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాలంటీర్ల ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తాం' - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లా రాజుపాలెంలో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

tdp leaders fire on volunteers election campaign in nellore district
'వాలంటీర్ల ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేస్తాం'

By

Published : Feb 11, 2021, 5:37 PM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని... స్థానిక తెదేపా నేతలు ఆరోపించారు. వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా 33 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తే, అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాజీనామాను అధికారులు ఆమోదిస్తే వారి దగ్గర చరవాణులు, ప్రభుత్వ డేటా ఎందుకు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details