ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో గృహాలకు రంగులు మార్చడంపై తెదేపా ఆగ్రహం

నెల్లూరు జిల్లాలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు నీలి రంగు వేశారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించి రంగులు వేసిన గృహాలకు... మళ్లీ కలర్లు వేయటం ఏమిటని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను నిలదీశారు.

tdp leaders fire
తెదేపా శ్రేణుల ఆగ్రహం

By

Published : Dec 3, 2020, 3:28 PM IST

నెల్లూరు నగరంలోని జనార్ధన్‌రెడ్డి కాలనీలో టిడ్కో ఇళ్లకు నీలిరంగు వేశారు. గత ప్రభుత్వ హయాంలో పైలెట్‌ ప్రాజెక్టుగా 4800 గృహాలను నిర్మించారు. రంగులను వేసి లబ్ధిదారులకు కేటాయించారు. ప్రభుత్వం మారగా.. ఏడాదిన్నరగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ డిసెంబరు 25న ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. జిల్లాలో 41,028 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. అయితే గృహాలకు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. భవనాలకు ముందుగా తెలుపు రంగు వేసి అనంతరం నీలిరంగును వేశారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మించి రంగులు వేసిన ఇళ్లకు మళ్లీ రంగులు వేయడం ఏమిటని తెదేపా నేత అబ్దుల్‌ అజీజ్ ప్రశ్నించారు.‌ నగరపాలక సంస్థ కమిషనర్, టిడ్కో డీఈఈలకు ఫోన్‌ చేసి ఇళ్లకు వేస్తున్న రంగులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కేసులు పెట్టి అరెస్టు చేయిస్తానని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణం గుత్తేదారు సంస్థ ఎన్‌సీసీ కార్యాలయానికి వెళ్లి రంగులు వేసేందుకు ఉన్న వర్క్‌ ఆర్డర్‌ను చూపించాలని నిలదీశారు. రంగులు వేసిన ఇళ్లకు మళ్లీ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details