డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు తీర్పుపట్ల నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఎస్.సి. సెల్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును స్వాగతిస్తూ నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. డాక్టర్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయమనటం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తేదేపా నేత జన్ని రమణయ్య అన్నారు. ఇప్పటికైనా డాక్టర్ సుధాకర్ కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పుపై తెదేపా నేతల హర్షం - covid cases in nellore dst
విశాఖలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తేదేపా నాయకులు స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని నెల్లూరు జిల్లా తెదేపా నేత జన్ని రమణయ్య వ్యాఖ్యానించారు.
tdp leaders felt happy abut doctor sudhakar attck verdict in high court