అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి ఏడాదైనా.. కనీసం వ్యర్థాలను కూడా తొలగించకుండా వదిలేశారని నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని భయబ్రాంతులకు గురి చేసేందుకు 31 మంది ముఖ్య నాయకులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కక్షపూరిత రాజకీయాలను విడనాడి, ప్రజలిచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాలని ఆయన కోరారు.
'కక్షపూరిత రాజకీయాలతో సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారు' - ప్రజావేదిక తాజా వార్తలు
కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చేసి ఏడాదైన సందర్భంగా నెల్లూరు జిల్లాలో తెదేపా నేతలు స్మృత్యంజలి ఘటించారు.
నెల్లూరులో ప్రభుత్వంపై తెదేపానేతల విమర్శలు