వైకాపా అధికారంలో వచ్చినప్పటి నుంచి నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆరోపించారు. పెరిగిన ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని గెలిపించాలని సోమిరెడ్డి ప్రజలను కోరారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు - తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మి
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు పెంచింది. ఎండను కూడా లెక్కచేయకుండా కార్యకర్తలతో కలిసి అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓ దుకాణం వద్ద టీ కలుపుతూ.. ఓట్లను అభ్యర్థించారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు