ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా ఆందోళన - నెల్లూరు తెదేపా నేతల నిరసన వార్తలు

మద్యం దుకాణాలు మూసివేయాలని నెల్లూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. వివాహాలకు పరిమిత సంఖ్యలో అనుమతించే ప్రభుత్వం, మద్యం దుకాణాల వద్ద వందల సంఖ్యలో మందుబాబులు గుమిగూడుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు.

tdp leaders agitation against  wine shops
మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా ఆందోళన

By

Published : Aug 13, 2020, 4:53 PM IST

మద్యం దుకాణాలే కరోనా ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయని.. నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుటు తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో.. మద్యం దుకాణాలు మూసివేయాలని నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్​రెడ్డి డిమాండ్ చేశారు.

వివాహాలకు పరిమిత సంఖ్యలో అనుమతించే ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్ద వందల సంఖ్యలో మందుబాబులు చేరుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించటం లేదని ఆరోపించారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు.. ఇప్పటికైనా మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details