నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలని వద్ద తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాజకీయ దురుద్దేశంతోనే ఏడాది క్రితం పూర్తయిన ఇళ్లను కూడా వైకాపా ప్రభుత్వం ఇవ్వడంలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అన్ని హంగులతో నిర్మించిన ఇళ్లను కాకుండా, 9 అంకణాల స్థలం ఇస్తామంటూ జీఓ మాత్రం 6 అంకణాలకే ఇచ్చారని దుయ్యబట్టారు. లబ్ధిదారులకు వెంటనే ఇల్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతలు ఆందోళన.. నుడా మాజీ చైర్మన్ అరెస్టు - tdp protest in nellore
హౌస్ ఫర్ ఆల్ కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెలుగు దేశం పార్టీ ఆందోళన చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేస్తున్నారంటూ కోటంరెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
తెదేపా నేతలు ఆందోళన.. నుడా మాజీ చైర్మన్ అరెస్టు చేసిన పోలీసులు
తెలుగుదేశం పార్టీ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేస్తున్నారంటూ కోటంరెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా పట్టించుకోని పోలీసులు తమను మాత్రం అరెస్టు చేయడం అన్యాయమని కోటంరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.