అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల తెదేపా అధ్యక్షుడు, వరకవిపూడి సర్పంచ్ అభ్యర్థి సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. అర్ధరాత్రి తన ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో మహిళలున్నప్పటికీ.. మహిళా పోలీసులు లేకుండానే ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. తెదేపా మద్దతుదారులను పోటీనుంచి తప్పించేందుకే ఇలా వేధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.
'అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే పోలీసుల వేధింపులు ' - nellore tdp latest news
అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు తమను వేధిస్తున్నారని తోటపల్లి గూడూరు మండల తెదేపా అధ్యక్షుడు సురేష్ రెడ్డి ఆరోపించారు. తెదేపా మద్దతుదారులను పోటీనుంచి తప్పించేందుకే ఇలా వేధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.
'అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే పోలీసుల వేధింపులు '