'రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం మానుకోవాలి' - ఏపీలో రంగుల వివాదం
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును తెదేపా స్వాగతించింది. ఇకనుంచైనా రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల అంశంపైసుప్రీంకోర్టు తీర్పునుతెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. '4 వారాల్లో పార్టీ రంగులు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేంశించింది. లేదంటే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. విలువలు పాటించే వారైతే వెంటనే రాజీనామా చేస్తారు. మీరు అలాంటి సంప్రదాయాలు పాటించేవారు కాదు కాబట్టి.... ఇకనుంచైనా రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం మానుకోవాలని ప్రభుత్వానికి నా సలహా' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.