ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి కుంభకోణాలు, నేరాలకు అడ్డగా నెల్లూరు జిల్లా : సోమిరెడ్డి - నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో అవినీతి

SOMIREDDY : నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో అవినీతి బాగోతం బయటపడినా.. సంబంధిత మంత్రులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటిని తెదేపా నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాలు, నేరాలకు నెల్లూరు జిల్లా నాలుగో రాజధానిగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

SOMIREDDY ON CORRUPTION IN NELLORE
SOMIREDDY ON CORRUPTION IN NELLORE

By

Published : Oct 15, 2022, 4:31 PM IST

SOMIREDDY ON CORRUPTION IN NELLORE : అవినీతి కుంభకోణాలు, నేరాలకు నెల్లూరు జిల్లా నాలుగో రాజధానిగా తయారవుతోందని తేదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో అవినీతి బాగోతం బయటపడినా.. సంబంధిత మంత్రులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటిని ప్రశ్నించారు.

నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో 29.78 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ వీరపాండ్యన్ ప్రకటించారని.. అయితే ఈ అవినీతి ఒక్క నెల్లూరుకే పరిమితమా, లేక రాష్ట్రవ్యాప్తంగా జరిగిందో తేల్చాలన్నారు. కింద స్థాయి సిబ్బందిని బూచిగా చూపించి పెద్దవారిని వదిలేస్తున్నారని.. ఈ అవినీతిలో మంత్రికి వాటా ఉందని విమర్శించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరులుతోందని, ఇందుకు మంత్రి అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పౌరసరఫరాల సంస్థలో జరిగిన అవినీతిపై లోతుగా దర్యాప్తు చేసి ఎవరి పాత్ర ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details