TDP leader Somireddy: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సాంకేతిక ప్రమాణాలతో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నష్టాలను సాకుగా చూపి.. జెన్‌కో అదానీ పరం చేసే యత్నం: సోమిరెడ్డి
Somireddy on YSRCP: నెల్లూరు జిల్లా నెలటూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. నష్టాలను సాకుగా చూపి జెన్‌కోను అదానీ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
somi reddy
నష్టాలను సాకుగా చూపి జెన్‌కోను అదానీ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. యాష్ పాండ్ సకాలంలో శుభ్రం చేయకపోవటమే ప్రమాదానికి కారణమన్నారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణ జరిపించి.. త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని సోమిరెడ్డి సూచించారు.