కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్ బిల్డింగ్లో ఆనందయ్య మందును అనధికారికంగా తయారు చేసి ఇస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్, స్టేట్ హెల్త్ సెక్రటరీ ప్రకటించినా పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని ఆరోపించారు. ఆనందయ్య బీసీ కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయివుండుంటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అని ప్రశ్నించారు.
ఆనందయ్య మందు పెద్దలకేనా ? - TDP leader Somireddy Chandramohan criticized the government over the Anandayya drug
నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నం ఆనందయ్య మందు పెద్దలకేనా పేదలకు వద్దా అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్