నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా ఎస్సీ సెల్ నేత కరటం మల్లికార్జున భార్య.. నిండు గర్భిణి ధర్నా చేస్థున్నారు. తన భర్తని ఎమెల్యే అనుచరులు కొట్టి పోలీస్ స్టేషన్ లో నిర్భందించారని ఆరోపించారు. ఎలాంటి కేసులు లేకున్నా , దాడి చేసి తీసుకు వచ్చారన్నారు. కొడవలూరు మండలంలో ఏ ఎన్నికలు జరిగినా తెదేపా తరపున తాము నిలబడి ఎన్నికలను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇది ఓర్వలేక వైకాపా పార్టీ నేతలు తమపై కక్ష గట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుచుకుంటున్నారని మల్లికార్జున భార్య రమ్య ఆరోపించారు. కొడవలూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.
తెదేపా నేత కరటం మల్లికార్జున అరెస్ట్.. పీఎస్ ఎదుట భార్య నిరసన - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
తెదేపా నేత కరటం మల్లికార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెదేపా నేతలు, మల్లికార్జున భార్య నిండు గర్భిణి.. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
tdp leader