ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'థర్డ్ వేవ్​ను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి' - కరోనా థర్డ్ వేవ్ తాజా వార్తలు

కరోనా థర్డ్ వేవ్​ను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అదనంగా పడకలు ఏర్పాటు చేయాలన్నారు.

corona cases at nellore
corona cases at nellore

By

Published : May 18, 2021, 6:50 PM IST

కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉంటుందన్న హెచ్చరికలతో నెల్లూరు జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తేదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు అదనంగా 50 పడకలు ఏర్పాటు చేయడం మంచిపరిణామమని అన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని మరో 300 పడకలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

మంత్రి అనిల్​పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పారు. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు.

ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు

ABOUT THE AUTHOR

...view details