కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్మూ, ధైర్యం లేక.. తెదేపా కార్యకర్తల ఆస్తులపై మంత్రి అనిల్ దాడులు చేయిస్తున్నారని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఓడిపోతుందనే భయంతోనే తెదేపా అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన - ap 2021 news
మంత్రి అనిల్ తెదేపా కార్యకర్తలపై కావాలనే దాడులు చేయిస్తున్నారని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన తెదేపా నేత
తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలంటే తనను దాటుకుని వెళ్లాలన్నారు. రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేషన్ అధికారులతో శ్రీనివాసులు రెడ్డి ఫోన్లో మాట్లాడారు.
ఇదీ చూడండి:Chandrababu: తెదేపా ఫ్లెక్సీల చించివేత.. పార్టీ నేతల ఆగ్రహం
TAGGED:
KOTAMREDDY SRINIVASULU REDDY