నెల్లూరు జిల్లా కావలి పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై కావలి జర్నలిస్ట్ క్లబ్లో మాట్లాడేందుకు వెళ్లిన తనను అకారణంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైకాపా నేతలు చెప్పినట్లు పోలీసులు నడుచుకోవడం దారుణమని విమర్శించారు. అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'కావలి పోలీసుల తీరుపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం' - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వార్తలు
కావలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా నేతలు చెప్పినట్లు వారు నడుచుకుంటున్నారని ఆరోపించారు.
కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి