కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కేసులకు తగినట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. కరోనా వంటి కష్టసమయంలోనూ కక్కుర్తి పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఒక్క ల్యాబ్ ఉండటంతోనే ఫలితాలు రావటం ఆలస్యమవుతోందని... మరో రెండు ల్యాబ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు అందించే ఆహార కాంట్రాక్టర్ పనులు మంత్రి బంధువులకే అప్పగించి, నాసిరకమైన భోజనం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి... సమీక్షలతో కాలం వెల్లదీయటం సరికాదని హితువు పలికారు.
'ధైర్యం చెప్పాల్సిన సీఎం... సమీక్షలతో కాలం వెల్లదీస్తున్నారు' - tdp leader kotam reddy srinivas reddy comments latest news
కరోనా బాధితులకు అందించే ఆహార కాంట్రాక్టర్ పనులు మంత్రి బంధువలకే అప్పగించారని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. అందువల్లే బాధితులకు నాసిరకమైన ఆహారం సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వంపై కోటంరెడ్డి ధ్వజం