ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దుకాణాల కూల్చివేతతో నష్టపోయిన కార్మికులను ఆదుకోండి' - demolition of the shops in auto nagar at nellore news

నెల్లూరు జిల్లా ఆటోనగర్ వద్ద దుకాణాలు కూల్చివేసిన కారణంగా.. నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలని నెల్లూరు తెదేపా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల అధికారులు దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఈ విషయమై కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.

tdp leader fires on  demolition of the shops in nellore district
దుకాణాలు కూల్చివేతలో నష్టపోయిన కార్మికులను ఆదుకోండి

By

Published : Nov 22, 2020, 6:51 AM IST

నెల్లూరు జిల్లా ఆటోనగర్ వద్ద దుకాణాలు కూల్చేయడంతో నష్టపోయిన కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలని... నెల్లూరు తేదేపా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్మికుల పట్ల అధికారులు దారుణంగా వ్యవహరించారన్నారు.

కనీసం రెండు గంటల సమయం కూడా ఇవ్వకుండా దుకాణాలు ధ్వంసం చేశారని ఆయన కలెక్టర్​కు తెలిపారు. రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వారిని ఇలా చేయడం బాధాకరమన్నారు. వైకాపా నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details