ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో నెగ్గింది: దేవినేని - tirupati by poles

రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్లతోనే గెలిచిందని తెదేపా నేత దేవినేని ఆరోపించారు. తిరుపతిలో ఇదే వ్వూహాన్ని అమలు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన అన్నారు.

devineni uma
వైకాపా దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో నెగ్గింది: దేవినేని

By

Published : Apr 10, 2021, 3:43 PM IST

వైకాపా ప్రభుత్వంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండాపోతోందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నెల్లూరులో మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీ ఎన్నికల్లో వారికి ఇష్టం వచ్చిన విధంగా.. దొంగ ఓట్లు వేసుకొని గెలిచారే తప్ప, నిజాయితీగా ఓటింగ్ జరగలేదని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. దీనికోసం వాలంటీర్ల వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ధరలు, నిత్యావసర ధరలు భారీగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details