నీటిపారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ నెల్లూరులో డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో నీటిపారుదలపై రూ.64 వేల కోట్ల వ్యయం.. పోలవరం డ్యామ్ పనులు 71 శాతం పూర్తిచేశామన్న ఆయన.. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. డీపీఆర్-2కు ఆమోదం తెప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన వైకాపాకు 28 మంది ఎంపీలున్నా ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సర్వం అవినీతిమయం చేశారని ఉమ ధ్వజమెత్తారు.
' శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా..?'
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు గుప్పించారు. నీటిపారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈమేరకు వివరాలు వెల్లడించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
తెదేపా నేత దేవినేని ఉమ