హిందూ సాంప్రదాయాలకు వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెదేపా విమర్శించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థుల డిక్లరేషన్‌కు మినహాయింపులు ఇచ్చేందుకు ప్రయత్నించడం సరికాదని నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సీఎం జగన్ కోసమే ఈ మినహాయింపులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయాన్ని గౌరవించడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా తితిదే ఛైర్మన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని... సనాతన సంప్రదాయాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
'హిందూ సాంప్రదాయాలకు వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది' - తితిదే డిక్లరేషన్ పై సమీక్ష
తితిదే సంప్రదాయాలను కాపాడాలని నెల్లూరులోని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులు దారుణమని ఆయన అన్నారు.
తెదేపా నేతల సమావేశం
ఇదీ చూడండి. వివేకా హత్య కేసులో మరో ముగ్గురు అనుమానితుల విచారణ