ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా?: అచ్చెన్నాయుడు

Atchannaidu on YSRCP leader attack on a Woman: నెల్లూరు జిల్లా కుమ్మరకొండూరులో భూ ఆక్రమణను అడ్డుకున్న మహిళపై వైకాపా నేత దాడి చేయడంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సుభరత్నమ్మపై వైకాపా నేత దాడిని ఖండించిన అచ్చెన్న.. జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా అని నిలదీశారు.

తెదేపా నేత అచ్చెన్నాయుడు
తెదేపా నేత అచ్చెన్నాయుడు

By

Published : Apr 22, 2022, 9:58 PM IST

Atchannaidu News: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైకాపా నేత మహేశ్​ దాడిని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. 'జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా' అని నిలదీశారు. ఫ్యాక్షన్ మనస్తత్వమే వైకాపా సిద్ధాంతమని అన్నారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైకాపా నాయకుల ప్రథమ కర్తవ్యమని అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో రాష్ట్రం 1వ స్థానం, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని మండిపడ్డారు.

మహిళల కోసం 'దిశ'ను తీసుకొచ్చి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి.. ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని అచ్చెన్న నిలదీశారు. వైకాపా మూడేళ్లల్లో ఆ పార్టీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా.. ఇంత వరకు ఒక్క వైకాపా నేతను కూడా అరెస్ట్ చేసిన ధాఖలాలైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. 'వైకాపా నేతలు అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ.. మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా?' అని అచ్చెన్న దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి లేదు : నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details