తెదేపా 40 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ మండల కన్వీనర్ బయన్న పార్టీ జెండాను ఎగరవేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు తెదేపాను స్థాపించారని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని బయన్న పేర్కొన్నారు.
ఉదయగిరిలో ఘనంగా తెదేపా ఆవిర్బావ వేడుకలు - ఉదయగిరిలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తెదేపా ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెదేపా మండల కన్వీనర్ బయన్న తెలిపారు.
ఉదయగిరిలో ఘనంగా తెదేపా ఆవిర్బావ వేడుకలు