CBN TELECONFERENCE : నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 23 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు .. ఒక్కో కుటుంబానికి పార్టీపరంగా 15 లక్షలు రూపాయలు చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో మరికొందరు నేతలు తమ వంతుగా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. వీరిలో కంచర్ల సుధాకర్ 2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్ లక్ష రూపాయలు, ఇంటూరి నాగేశ్వరరావు లక్ష రూపాయలు, ఇంటూరి రాజేశ్ లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పార్టీ ఇచ్చే 15 లక్షలతో పాటు.. తెదేపా నేతలు ప్రకటించిన ఆర్థిక సాయంతో.. ఒక్కో కుటుంబానికి 23 లక్షల రూపాయలు అందజేయనున్నారు.
మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23లక్షల ఆర్థిక సాయం.. - టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరిహారం
CBN TELECONFERENCE : కందుకూరు ఘటనలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.23లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మొదట రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించినా.. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు.
CBN TELECONFERENCE