ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు' - గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వార్తలు

వైకాపా ఏడాది పాలనపై మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరులో పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

tdp ex mla
tdp ex mla

By

Published : Jun 10, 2020, 7:26 AM IST

గూడూరు తెదేపా మాజీ ఎమ్మల్యే సునీల్ కుమార్.. వైకాపా ఏడాది పాలనపై మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని ఆరోపించారు. గూడూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం 5వేల102 ఎన్టీఆర్​ గృహాలను పేదలకు నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో వైకాపా ఉచితంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే మూడు విడతలుగా డబ్బులను వాయిదా పద్ధతిలో కట్టాలని నోటీసులు పంపడం సరికాదన్నారు. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details