నిరాహారదీక్ష చేపట్టిన తెదేపా జిల్లా అధ్యక్షుడు - hunger strike in nellore
వైద్యులకు, నర్సులకు , క్వారంటైన్లో ఉన్నవారికి పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వాలని కోరుతూ... నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్ రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.

నిరాహారదీక్ష చేపట్టిన తెదేపా జిల్లా అధ్యక్షుడు
నెల్లూరు జిల్లా తెదేపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్ల రెడ్డి 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. జిల్లాలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా జిల్లాలో, నెల్లూరు నగరంలోని శివారు కాలనీల్లో అనేక మందికి పనులు లేక , తిండిలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.