వైకాపా దౌర్జన్యం, అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రకటించారు. నెల్లూరు తేదేపా కార్యాలయంలో జిల్లా స్థాయి లీగల్ సెల్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వైకాపా ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్ఠు పట్టిపోయాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైకాపా దాడులు చేయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లీగల్ సెల్ కమిటీలను బలోపేతం చేసి, పార్టీ కార్యకర్తలను, నాయకులను పూర్తి స్థాయిలో న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరుకు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామన్నారు.