నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా దళిత మహిళా నేతలు నల్ల కండువాలు కప్పుకుని నిరసన తెలిపారు. 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున తెదేపా తరపున పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థి పట్ల స్థానిక ఎస్సై వివక్షతో వ్యవహరించారని మండిపడ్డారు. నడి రోడ్డుపై అభ్యర్థితో చొక్కా విప్పించి.. నిలబెట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుడనే కారణంగా అతన్ని అవమానించారని ఆరోపించారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
నాయుడుపేటలో తెదేపా దళిత మహిళా నేతల నిరసన - TDP Dalit women leaders protest news
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా మహిళా నేతలు ఆందోళన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద దళిత అభ్యర్థిని అవమానించారని.. నల్ల కండువాలు కప్పుకుని నిరసన తెలిపారు.
![నాయుడుపేటలో తెదేపా దళిత మహిళా నేతల నిరసన TDP Dalit women leaders protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10990492-1097-10990492-1615625359303.jpg)
తెదేపా దళిత మహిళా నేతల నిరసన