తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలంటూ ఎన్నికల అధికారి దినేష్ పాటిల్‌కు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను వినియోగించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. వారితోనే నగదు, కరపత్రాలు పంపిణీ చేయిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
'వాలంటీర్ల ద్వారా వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది' - నెల్లూరు తెదేపా తాజా వార్తలు
వాలంటీర్ల ద్వారా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. వారితో డబ్బు, నగదు పంపిణీ చేయిస్తోందని ఆరోపించారు.
వైకాపాపై తెదేపా ఎన్నికల అధికారికి ఫిర్యాదు