ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేలా తీర్పునివ్వండి: పనబాక లక్ష్మీ - పనబాక లక్ష్మీ ఎన్నికల ప్రచారం వార్తలు

నెల్లూరు జిల్లాలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే రాష్ట్ర సమస్యలపై పోరాడుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలు తీర్పునివ్వాలన్నారు.

tdp candidate panabaka lakshmi election campaign in nellore district
నెల్లురు జిల్లాలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం

By

Published : Mar 29, 2021, 5:04 AM IST

నెల్లూరు జిల్లా పెళ్లకూరులో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిపించాలని కోరారు. తనను పార్లమెంట్​కు పంపిస్తే రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో పప్పు ధాన్యాలు, గ్యాస్ ధరలు పెరిగాయని విమర్శించారు. ఏవి కూడా సామాన్యులు కొనే పరిస్థితులు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. .

ABOUT THE AUTHOR

...view details