నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్తసత్ర, అన్నగారిపాలెం, చిన్ననట్టు, పూలదొరువు తదితర ప్రాంతాల్లో రైతులు 300 ఎకరాల్లో చామ పంట సాగు చేశారు. పంట వేసిన నాలుగో నెల వచ్చేసరికి తెగుళ్లు సోకాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా తగ్గడం లేదని... ఉద్యానవనశాఖ అధికారులకు చెప్పారు. వారు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికే ఎకరానికి ఒకటిన్నర లక్షలు పెట్టుబడులు పెట్టగా... తెగులు సోకి పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కావలిలో చామదుంపకి వచ్చింది కష్టం..! - నెల్లూరు జిల్లా కావలిలో చామదుంప వార్తలు
ఈ ఏడాది వర్షాలు రావన్న ఆలోచనలతో రైతులు అక్టోబర్ నెలలో చామ పంటను వేశారు. గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఆకుమచ్చ, రూపాయి తెగుళ్లు పంటలపై ప్రభావం చూపి దిగుబడి తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![కావలిలో చామదుంపకి వచ్చింది కష్టం..! taro beet Damaged at kavali in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5880820-1041-5880820-1580282171944.jpg)
చామ పంట