ఎన్నికలకు ముందు నెల్లూరు నగరంలో సందడి చేసిన స్వచ్ఛ మిషన్ పారిశుద్ద్య యంత్ర పరికరాలు... ఇప్పుడు మూలనపడి ఉన్నాయి. నగరంలోని ప్రతి ప్రాంతంలో... స్వచ్ఛ యంత్రాలతో మురుగును శుభ్రం చేశారు. రాష్ట్రంలోని అనేక పురపాలక సంఘాల నుంచి వీటిని నెల్లూరు నగరానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం నగరంలోని నగరపాలక సంస్థలో ఈ పరికరాలు మెకానికల్ షెడ్లు, వాటర్ ట్యాంకుల కింద నిరుపయోగంగా పడి ఉన్నాయి.
మూలన పడ్డ స్వచ్ఛమిషన్ యంత్రాలు.. పట్టించుకోని అధికారులు - swatch machines at nellore latest news
కోట్లాది రూపాయలు విలువైన యంత్ర పరికరాలు పనికిరాకుండా మూలకు చేరాయి. నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్య యంత్రాలు మెకానికల్ షెడ్లలో నిరుపయోగంగా పడి ఉన్నాయి.
నెల్లూరులో మరుగునపడ్డ స్వచ్ఛమిషన్ యంత్రాలు